డొనాల్డ్ ట్రంప్‌కు జో బైడెన్ ఆతిథ్యం
డొనాల్డ్ ట్రంప్‌తో దేశాధ్యక్షుడు జో బైడెన్ సమావేశమవుతారని వైట్‌హౌస్ ప్రకటించింది. బైడెన్ ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రటరీ కరీన్ జీన్ పియరీ తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా వైట్‌హౌస్‌కు ఆహ్వానించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ కొత్త స్టాఫీ చీఫ్ మాజీ సూజీ వైల్స్‌తో బైడెన్ స్టాఫ్ చీఫ్ జెఫ్ జియెంట్స్ నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడిరచాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్‌కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్ హాజరు కావేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్‌హౌస్ ఆనవాయితీగా వస్తోంది.






