ఫ్లోరిడాకు అధ్యక్షుడు, ప్రథమ మహిళ… రాక

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సర్ఫ్సైడ్ పట్టణంలో 12 అంతస్తుల నివాస భవనం పాక్షికంగా కూలి ఆరు రోజులు దాటినా శిథిలాల తొలగింపు ఇంకా పూర్తికాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటిదాకా 11 మంది మృతులను మాత్రమే గుర్తించారు. ఇంకా 150 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆప్తులు ఏమై ఉంటారని బాధితులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్టు మియామి- డేడ్ మేయర్ డేనియెల్లా లెవిన్ కావా మీడియాకు తెలిపారు. శిథిలాల కింద తమవాళ్లు సజీవంగా ఉంటారని కొందరు, కనీసం మృతదేహాలైన కనిపిస్తాయా అని మరికొందరు ఆందోళన చెందుతున్నట్టు వెల్లడించారు. వాన కురవటంతో శిథిలాలు మరింత కూరుకుపోయాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ సర్ఫ్సైడ్ సందర్శించి బాధితులను పరామర్శించనుననట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి.