జో బైడెన్ కంటే కమలా హారిస్ బెటర్
అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని జో బైడెన్‌పై ఒత్తిళ్తు తీవ్రమవుతున్న వేళ ఆయన కంటే కమలా హారిస్ మంచి అధ్యక్షురాలు అవుతారని మెజారిటీ డెమొక్రాట్లు భావిస్తున్నారు. ప్రతి 10 మంది డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల్లో ఆరుగురు కమలా హారిస్ అగ్ర రాజ్యాధినేతగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆమె సామర్థ్యం పై అపనమ్మకం వెలిబుచ్చగా, మరో ఇద్దరు ఎటూ చెప్పలేమని తమకు అంతగా తెలియదని చెప్పుకొచ్చారు. ట్రంప్‌తో జూన్ 27న జరిగిన తొలి అధ్యక్ష చర్చల్లో బైడెన్ తడబడటం, మతిపమరపుతో పేలన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్‌ను ఓడిరచాలంటే అది కమలకే సాధ్యమవుతుందని, బైడెన్ స్థానంలో ఆమె తమ అధ్యక్ష అభ్యర్ధి కావాలని డెమొక్రాట్లు డిమాండ్లు వినిపిస్తున్నారు.






