ఆసియన్-అమెరికన్ల భద్రతకు… ప్రత్యేక

కరోనా నేపథ్యంలో ఆసియన్-అమెరికన్లపై అకస్మాత్తుగా పెరిగిన విద్వేషపూరిత నేరాలను అదుపు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. ఇలాంటి నేరాలను కచ్చితంగా గుర్తించి, తగిన చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం కింద ప్రత్యేకంగా విద్వేషపూరిత నేరాల దర్యాప్తు కేంద్రాలు ఏర్పాటవుతాయి. వాటికి నిధులు సమకూరుతాయి. సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు రాష్ట్రాలు హాట్‍లైన్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలు కలుగుతుంది. విద్వేషాలకు అమెరికాలో స్థానం లేదు అని చెప్పారు.