బైడెన్ రాజీనామా చేసి హారిస్‌ను అధ్యక్షురాలిని చేయాలి!
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీ కాలం ముగియడానికి కొన్ని వారాలే మిగిలి ఉన్న సందర్భంలో ఓ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే వరకు కమలా హారిస్‌కు పదవి అప్పగించాలని ఆమె మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జమాల్ సిమన్స్ సూచించారు. బైడెన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఉపాధ్యక్షురాలు హారిస్‌ను అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిని చేయాలని ఓ టాక్ షోలో పేర్కొన్నారు. రాబోయే కాలంలో అధ్యక్ష ఎన్నికల పోటీలో మహిళలు నిలవడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుందని జమాల్ సిమన్స్ వ్యాఖ్యానించారు.






