హమాస్ కోరిన మార్పులకు… అమెరికా నో
అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి హమాస్ కోరిన కొన్ని మార్పులు చేపట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తిరస్కరించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ దోహాలో మీడియాతో మాట్లాడుతూ తాము ప్రతిపాదించిన ఒప్పందంలో బందీల విడుదలతో సహా పలు అంశాలపై హమాస్ మార్పులు చేయాలని కోరుతోందని, అవి తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు. గాజాలో శాశ్వత కాల్పులు విరమణకు మూడంచెల ప్రణాళికే సరైన పరిష్కారమార్గమని బ్లింకెన్ సెలవిచ్చారు. ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందానికి హమాస్‌ను ఒప్పంచాలని అమెరికా చూస్తోంది. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే, ఆ ప్రభుత్వ అంగీకారంతోనే ఈ ఒప్పందాన్ని తాము ముందుకు తెచ్చామని బ్లింకెన్ పునరుద్ఘాటించారు.






