జో బైడెన్ కీలక ప్రకటన.. అధ్యక్ష రేసు నుంచి
అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు పెరుగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధ్యక్షుడి సన్నిహితులు వెల్లడించారు. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న వేళ ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు వారు తెలిపారు. పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని డెమాక్రాటిక్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.






