భారత్ కు షాక్… 26 వస్తువులపై

భారత్‍తో టారిఫ్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునర్విచారణ జరిపిస్తున్నారు. అమెరికా టెక్ కంపెనీలపై భారత్ డిజిటల్ కంపెనీలపై భారత్ డిజిల్ సర్వీసెస్ ట్యాక్స్ (డీఎస్) విధిస్తున్న నేపథ్యంలో ప్రతీకారం సుంకాలు పెంపునకు సంకేతాలిచ్చారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలు, బాస్మతి బియ్యం నుంచి ఫర్నీచర్, జువెల్లరీలపై టారీఫ్‍లు పెంచేందుకు అమెరికా కసరత్తు చేస్తోంది. అమెరికాకు ఎగుమతయ్యే 26 భారత వస్తువులపై 25 శాతానికి పెంచాలనుకుంటున్నామని యూఎస్ ట్రేడ్ రిప్రజెన్‍టేటివ్ కేథరిన్ టాయ్ జూన్ 2న ప్రకటించారు. పెంచిన టారిఫ్‍లు డిసెంబర్ వరకు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. భారత్ విధిస్తున్న డీఎస్‍టీ అసమంజసమైనది లేదా వివక్షతో కూడినది. అమెరికా ఈ-కామర్స్ కంపెనీలపై భారం మోపడం లేదా నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని యూఎస్ ట్రేడ్ రిప్రజెన్‍టేటివ్ కేథరిన్ అన్నారు.
భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఎంపిక చేసిన వస్తువులపై భారత అంచనాలకు తగ్గట్టుగా టారిఫ్‍లు విధిస్తామని చెప్పారు. కాగా గతేడాది ఏప్రిల్ ప్రారంభం నుంచి భారత్‍లో అమెజాన్, ఫేస్‍బుక్, గూగుల్ వంటి విదేశీ టెక్నాలజీ, ఈ కామర్స్ కంపెనీల లాభాలపై టారిఫ్‍ను 2 శాతం మేర పెంచింది. ఈ నిర్ణయాన్ని అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అధ్యక్షుడు బైడెన్ కూడా ట్రంప్ బాటలోనే నడుస్తున్నారు.