ట్రంప్ ఓడిపోతే.. నాకు ఆ విశ్వాసం లేదు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే కమలాహారిస్‌కు శాంతియుతంగా అధికారాన్ని దక్కనిస్తారన్న విశ్వాసం తనకు లేదని వ్యాఖ్యానించారు. 2025 జనవరిలో అధికార మార్పిడి శాంతియుతంగా ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు బైడెన్ సమాధానమిస్తూ ట్రంప్ ఓడిపోతే, నాకు ఆ విశ్వాసం లేదు అని అన్నారు. 2021లో జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.






