ఆర్థిక నడవాపై జీ-7తో దేశాలతో కలిసి పనిచేస్తాం : బైడెన్
భారత్ నుంచి పశ్చిమాసియా మీదుగా ఐరోపా వరకూ నిర్మించే రైలు, రోడ్డు ఆర్థిక నడవా చైనా సిల్క్ రోడ్డుకు పోటీయేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. దీనిపై తాను జీ-7 దేశాలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. భారత్‌లో జరిగిన జీ-20 సదస్సులో ఆర్థిక నడవాపై తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్లో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో భేటీ అనంతరం బైడెన్ మీడియాతో మాట్లాడారు. మేం చైనా సిల్క్ రోడ్డుతో పోటీపడతాం. విభిన్న మార్గంలో దీనిని తీసుకెళ్తాం. చైనా ప్రాజెక్టుపై సంతకాలు చేసిన దేశాలన్నీ అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం. అయితే మా ప్రాజెక్టు చైనాకు పోటీయే తప్ప ఘర్షణకు కాదు. మేం చైనాతో ఆర్థికంగా, రాజకీయంగా, ఇతర అంశాలపరంగా పోటీపడతాం. కానీ ఘర్షణ కోసం పోటీపడం అని వెల్లడించారు.






