జిన్‌పింగ్ ఓ నియంత.. జో బైడెన్ ఆగ్రహం
అమెరికా, చైనా నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన పూర్తయిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనొక నియంత అంటూ మండిపడ్డారు. తాజాగా కాలిపోర్నియాలో నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. చైనాకు చెందిన అనుమానిత నిఘా బెలూన్ను తమ అధికారులు పేల్చివేసినప్పుడు జిన్‌పింగ్ చాలా ఆందోళనకు గురయ్యారని, ఆయన ఎందుకలా ప్రవర్తించారో తెలియదని అన్నారు. చైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు.






