Bide : 37 మందికి మరణదండన తప్పించిన బైడెన్
అమెరికాలో మరణదండనను ఎదుర్కొంటున్న 40 మందిలో 37 మందిని అధ్యక్షుడు జో బైడెన్ ఆ శిక్ష నుంచి తప్పించారు. వారి శిక్షను జీవితఖైదుగా మార్చారు. మరణశిక్షను పకడ్బందీగా అమలు పరచడాన్ని సమర్థించే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే కొద్ది రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంపై మరణదండనను వ్యతిరేకించే వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నా జీవితం యావత్తూ హింసాత్మక నేరాల నివారణకు, అమెరికా ఫెడరల్ న్యాయవ్యవస్థలో ధర్మబద్ధత పెంపొందించడానికే అంకితం చేశాను అని బైడెన్ పేర్కొన్నారు.






