ట్రంప్ పిలుపు బిడెన్ కు అనుకూలం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బృందం మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ విజయం పై అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం అనేక కౌంటీలో రీకౌంటింగ్ చెయ్యాలి అని అధికారులకు విజ్ఞప్తి చేశారు అందులో మిల్వాకీ కౌంటీ కూడా ఒకటి. అధ్యక్షులుగా ఎన్నికైన జో బిడెన్ మిల్వాకీ కౌంటీ రీకౌంటింగ్ ప్రక్రియలో మునుపటికంటే అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పై ఓట్లలో స్వల్ప ఆధిక్యం పొందారు అని విస్కాన్సిన్ యొక్క అతిపెద్ద మిల్వాకీ కౌంటీ శుక్రవారం 27 నవంబర్ 2020 న తన అధ్యక్ష సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ధృవీకరించింది. రీకౌంటింగ్ లో మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ 132 ఓట్ల ఆధిక్యం పొందగా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కు 134,482 ఓట్లు, మిస్టర్ బిడెన్ కు 317,527 ఓట్లు నమోదైనట్లు మిల్వాకీ కౌంటీ బోర్డ్ ఆఫ్ కాన్వాసర్స్ శుక్రవారం 27 నవంబర్ 2020 రాత్రి ప్రకటించింది.
కానీ అధ్యక్షులు ట్రంప్ ప్రచార బృందం రెండు అభ్యంతరాల తరువాత లెక్కింపులో భాగమైన 27,000 బ్యాలెట్లను వేరు చేశారు అని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా హాజరుకాని 25 వేలకు పైగా ఓటర్ల ఓటులను “నిరవధికంగా పరిమితం” గా స్వీయ-గుర్తింపు పొందిన వ్యక్తులు వేసిన బ్యాలెట్లకు అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కాక “ఎన్నికల అధికారి బ్యాలెట్ కవరుపై తప్పిపోయిన సమాచారాన్ని వేరే ఇన్క్ తో నింపుతారు. ఎందుకంటే ఎన్నికల అధికారి నింపిన సమాచారం గుర్తించడానికి” చట్టబద్దంగా అనుమతించబడిన ఈ చర్య ద్వారా సరిచేయబడిన 2,197 బ్యాలెట్లపై కూడా ఈ ప్రచార బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.






