వాటిని ఎన్నటికీ గెలవనివ్వం : బైడెన్
ఇజ్రాయెల్, ఉక్రెయిన్లకు మద్దతుగా నిలవడం తమ దేశ భద్రతా ప్రయోజనాలకు అత్యంత కీలకమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఓవల్ కార్యాలయం నుంచి బైడెన్ ప్రసంగించారు. వాటికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. హమాస్, రష్యా రెండూ ఒకటేనని పేర్కొన్నారు. వాటిని ఎన్నటికీ గెలవన్విబోమని ఉద్ఘాటించారు. హమాస్, రష్యా వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నా, ఒక విషయంలో ఆ రెండిరటి ఎజెండా ఒకటే. పొరుగున ఉన్న ప్రజా స్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయి. వాటి నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, ఉక్రెయిన్లకు మద్దతుగా నిలవడం అమెరికా భద్రతకు కీలకం అని ఆయన పేర్కొన్నారు.






