బైడెన్ చెప్పినా.. వెనక్కి తగ్గని ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. గాజా లోని రఫా నగరంపై భారీ దాడికి సిద్ధమవుతోంది. దాదాపు 14 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకుంటున్నారు. దాడిని ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో బైడెన్ మాట్లాడారు. రఫాలోని పౌరుల భద్రతకు చర్యలు తీసుకోకుండా, ఆ నగరంపై దాడి చేయొద్దని హితవు పలికారు. నెతన్యాహు మాత్రం హమాస్ ఉగ్రవాదులు రఫాలో ఉన్నారని, వారిని తుదముట్టించే వరకు తమ పోరు ఆగదని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒత్తిడులను తాను లెక్కచేయనన్న రీతిలోనే మాట్లాడారు. ఖాన్ యూనిస్‌లో నాసర్ ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇజ్రాయెలీ దళాలు ఆసుప్రతిలోకి ప్రవేశించాయి. అక్టోబరు 7 దాడి సందర్భంగా అపహరించిన బందీలను ఇక్కడ దాచి ఉంటారని అనుమానిస్తోంది.






