బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు బైడెన్ టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం తాను సిద్దమేనని ప్రకటించారు. ఈ సవాలును స్వీకరించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గర్జించేందుకు తాను సిద్ధమంటూ సోషల్ మీడియా పేర్కొన్నారు. జూన్ 27 సీఎన్ఎన్, సెప్టెంబరు 10న ఏబీసీ సంస్థలు అధ్యక్ష ఎన్నికల చర్చలను నిర్వహించనున్నాయి.






