ఒలింపిక్స్ కు పంపకపోవడం చైనాకు సరైన సందేశం : అమెరికా
బీజింగ్ శీతాకాల ఒలింపిక్స్ 2022ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. శ్వేతసౌధం నుంచి ప్రతినిధులు ఎవరూ ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనరని స్పష్టం చేసింది. శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అధికారికంగా ప్రకటించారు. షిన్జి యాంగ్ ప్రావిన్స్‌లో దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలో మేం 2022 బీజింగ్ శీతాకాల ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నాం. ఈ క్రీడల కోసం కఠినంగా సాధన చేసిన క్రీడాకారులను (అథ్లెట్లను) శిక్షించాలని అమెరికా అనుకోవడం లేదు. అందుకే మా అధికారిక దౌత్య బృందాన్ని మాత్రం బీజింగ్ శీతాకాల ఒలింపిక్స్‌కు పంపకపోవడం చైనాకు సరైన సందేశాన్ని ఇస్తుంది అని తెలిపారు.






