కీలక నిర్ణయం దిశగా బైడెన్ ప్రభుత్వం… ఉక్రెయిన్‌కు మద్దతుగా!
ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా తన మిలటరీ కాంట్రాక్టర్లను పంపే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటివరకు వీరిపై అమల్లో ఉన్న అప్రకటిత నిషేధాన్ని త్వరలో బైడెన్ యంత్రాంగం తొలగించే అవకాశం ఉంది. అయితే అధికారులు మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. ఒకవేళ కాంట్రాక్టర్లను పంపిస్తే, ఉక్రెయిన్‌కు సంబంధించి అమెరికా ప్రభుత్వం తీసుకొన్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రతిపాదనకు ఒక్కసారి ఆమోదముద్ర పడితే, అమెరికా కంపెనీలు ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా అక్కడ పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది. రష్యా దాడులతో దెబ్బతిన్న ఉక్రెయిన్ ఆయుధ వ్యవస్థలకు అమెరికా సైనిక కాంట్రాక్టర్లు మరమ్మతులు చేపడతారు.






