డాక్యుమెంటెడ్ డ్రీమర్లకు డాకా వర్తింపజేయండి.. బైడెన్ కు చట్టసభ్యల వినతి
హెచ్ 1బీ సహా ఇతర వలసేతర వీసాలతో అమెరికాలో దీర్ఘకాలంగా ఉంటున్న వారిపై ఆధారపడి జీవించేవారికి (డాక్యుమెంటెడ్ డ్రీమర్లు). 21 ఏళ్ల వయసొచ్చాక దేశం నుంచి వారిని బయటకు పంపించాలన్న నిబంధనల నుంచి రక్షణ కల్పించాలని పలువురు చట్ట సభ్యులు ప్రభుత్వానికి విన్నంచారు. బాల్యంలోనే అమెరికాకు వచ్చినవారికి తిరిగి బయటకు పంపించే చర్యచను వాయిదా వేసే (డాకా) ప్రత్యేక కార్యక్రమాన్ని వారీకీ వర్తింపజేయాలని కోరారు. చట్టసభ్యురాలు దెమోరాప్ా రాస్, సెనేటర్ అలెక్స్ పాడిల్లాల నేతృత్వంలో 49 మంది చట్టసభ్యులు బైడెన్ ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాశారు. వారిలో డెమొక్రటిక్ నేతలతో పాటు రిపబ్లికన్ నాయకులూ ఉన్నారు. దాదాపు రెండు లక్షల మంది డాక్యుమెంటెడ్ డ్రీమర్లకు డాకా ఆర్హతనును వర్తింపజేయాలని వారు కోరారు. ప్రభుత్వం ఈ వినతికి ఆమోదముద్ర వేస్తే వేలమంది ఇండో అమెరికన్లకు లబ్ది చేకూరనుంది.






