నిక్కీహేలీ కీలక వ్యాఖ్యలు.. అమెరికాకు చైనాతో
అమెరికాకు మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తానికి చైనా పెద్ద ముప్పుగా ఉంది. ఆ దేశం యుద్దానికి సిద్ధమవుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి అని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూహ్యాంప్షైర్లో ఆర్థిక వ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేశారు. అమెరికాకు చైనాతో ప్రమాదం పొంది ఉంది. అది యుద్దానికి సిద్ధమవుతోంది. అమెరికాను ఓడించేందుకు చైనా 50 ఏళ్ల నుంచి పన్నాగాలు పన్నుతోంది. కొన్ని విషయాల్లో చైనా సైన్యం ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలతో సమానంగా ఉంది. మన దేశ మనుగడకు, ముఖ్యంగా కమ్యూనిస్టు చైనాను ఎదుర్కోనేందుకు బలం, ఆత్మాభిమానం చాలా అవసరం. చైనా మన వాణిజ్య రహస్యాలను తెలుసుకుంటోంది. వారు మనపై గెలవాలని భావిస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు.






