ఆకుస్ కూటమి ఏర్పాటు : వైట్ హౌస్
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆకుస్ పేరుతో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా త్రైమాసిక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఏర్పాటు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యం కాదని వైట్‌హౌస్ కార్యదర్శి జెన్‌సాకీ తెలిపారు. అయితే, ఇండో`పసిఫిక్ ప్రాంతంలో 21వ శతాబ్దంలో ఎదురు కానున్న సవాళ్ల దృష్ట్యానే కూటమి ఏర్పాటు అని ఆ మూడు దేశాలు ప్రకటించడం గమనార్హం. ఆ ప్రాంతంలో తమ రక్షణ సామర్థ్యాన్ని సమున్నతస్థాయికి చేర్చడం కోసమని కూడా ఆ దేశాలు తెలిపాయి. ఆస్ట్రేలియా అణు జలాంతర్గాములు ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరించేందుకు తోడ్పాటు అందించడం కూడా తమ కూటమి లక్ష్యమని తెలిపారు. దీంతో ఈ కూటమి ఏర్పాటు ఆ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకునని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.






