చరిత్రలోనే ఆయనో చెత్త అధ్యక్షుడు : ఆర్నాల్డ్
కాపిటల్ భవనంపై దాడిని అమెరికా ప్రజాస్వామ్యంపై డొనాల్డ్ ట్రంప్ తిరుగుబాటు యత్నమని కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్కార్జ్ నెగ్గర్ పేర్కొన్నారు. ఆందోళనకారులను జర్మనీకి చెందిన నాజీలతో ఆయన పోల్చారు. ఆర్నాల్డ్ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. అమెరికాలోని కాపిటల్ భవనంపై దాడి గురించి స్పందిస్తూ 1938లో జరిగిన క్రిస్టల్లానాచ్ లేదా నైట్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్ గురించి తనకు బాగా తెలుసని, జర్మనీకి చెందిన నాజీలు ఆస్ట్రేలియాలోని యూధుల ఇళ్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించేవారని అన్నారు. అమెరికాలోని ట్రంప్ మద్దతు దారులు కూడా నాజీల్లాంటి వారేనని అన్నారు.
గత వారం చోటుచేసుకున్న ఘటన అమెరికాలో డే ఆప్ బ్రోకెన్ గ్లాస్ అని అన్నారు. ఆందోళకారులు పగలగొట్టింది కేవలం కిటికీ అద్దం మాత్రమే కాదు.. కాంగ్రెస్ చట్టసభ్యుల ఆలోచనలను కూడా పగలగొట్టారని ఆర్నాల్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ ఒక విఫల నేత అని, చరిత్రలోనే ఆయనో చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. అమెరికా రాజ్యాంగాన్ని తిరగరాయాలనుకునే వారు ఎప్పటికీ గెలవలేరన్నారు. కాగా, ఆర్నాల్డ్ కుటుంబ ఆస్ట్రియా నుండి అమెరికాకు వలసవచ్చింది. టెర్నినేటర్ వంటి చిత్రాలతో ఆయన హాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2003లో కాలిఫోర్నియాకు గవర్నర్గా ఎన్నికయ్యారు.






