అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ హెచ్చరిక..
మా దళాలపై తాను మద్దతిచ్చే గ్రూపులను ఇజ్రాయెల్, హమాస్ల యుద్దంలోకి ఇరాన్ దింపితే అది మరింత విస్తరించే ప్రమాదముందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. అప్పుడు అమెరికా పౌరులపై సైనిక దళాలపై దాడులు జరిగితే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మేం ఇది కోరుకున్నది కాదు. మేం ఆశించిందీ కాదు. యుద్దం విస్తరించాలని మేం కోరుకోవడం లేదు. మా పౌరులు, బలగాలు యుద్ధంలో లక్ష్యం కావాలని అనుకోవడం లేదు. కానీ అలాంటిది జరిగితే ఊరుకునేది లేదు అని బ్లింకెన్ స్పష్టం చేశారు.






