ఇజ్రాయెల్ పై ఈగ వాలదు : అమెరికా
అమెరికా ఉన్నంతవరకు ఇజ్రాయెల్‌పై ఈగ వాలనిచ్చేది లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌లో చేపట్టిన ఆయన ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక యూదు మతానికి చెందిన వ్యక్తిగా తన తాత, పెంపుడు తండ్రి నిర్బంధ శిబిరాల్లో అనుభవించిన హింస తనను తెలుసునని అన్నారు. ఆత్మ రక్షణ చేసుకోవడంలో మీరు ( ఇజ్రాయెల్) అత్యంత శక్తిమంతులు కావొచ్చు. కానీ అమెరికా ఉన్నంతవరకు మీరు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. మేమెప్పుడూ మీకు అండగా ఉంటా అని తెలిపారు.






