Blinken :గ్రీన్ లాండ్ విలీనం జరిగే పని కాదులే : బ్లింకెన్
గ్రీన్లాండ్ (Greenland )ను స్వాధీనం చేసుకుంటానన్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) బెదిరింపులను పట్టించుకుని సమయం వృథా చేసుకోవద్దని ప్రపంచ దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken )సూచించారు. అది జరిగే పని కాదులే అని కొట్టిపారేశారు. పారిస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మిత్ర దేశాలతో కలిసి అమెరికా పని చేస్తుందని, వాటితో బంధాన్ని బలోపేతం చేసుకుంటుందని స్పష్టం చేశారు. గ్రీన్ లాండ్ విలీనం ఆలోచన అసలు మంచిది కాదు. కానీ ముఖ్యమైంది. సహజంగానే విలీనం జరిగే పని కాదు. అందుకే మనం దాని గురించి మాట్లాడి సమయం వృథా చేయొద్దు. మిత్రులతో కలిసి పని చేస్తే మేము మరింత బలంగా ఉంటామని, మెరుగైన ఫలితాలు సాధిస్తామని బైడెన్ కార్యవర్గం నమ్ముతుంది. అంతేగానీ వారిని దూరం చేసుకునే పనులు, వ్యాఖ్యలు చేయం అని మిత్ర దేశాలకు వెల్లడిరచారు.






