అమెరికా విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన కేబినెట్లో ఎవరిని నియమించాలో నిర్ణయించారు. అధ్యక్ష ఎన్నికల్లో తనకు విదేశీ వ్యవహారాల విధానాల సలహాదారుడిగా సేవలందించిన ఆంటోనీ బ్లింకెన్‌ను అమెరికా విదేశాంగ మంత్రి పదవికి ఎంపిక చేశారు. అలాగే అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీని ప్రత్యేక వాతావరణ మార్పుల రాయబారిగా నియమించనున్నట్లు ప్రకటన చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా ప్రవాస క్యూబా న్యాయవాది అలెజాండ్రో మయోర్కస్ను, మాజీ సీఐఎ డైరెక్టర్ అవ్రిల్ హైనెస్ను ఇంటెలిజన్స్ వ్యవస్థ డైరెక్టర్‌గాను బైడెన్ నామినేట్ చేశారు.






