Donald Trump: అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ర్యాలీలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిరదని ఆరోపిస్తూ దేశమంతటా నిరసన ర్యాలీలు జరిగాయి. ఆర్థిక రాజధాని న్యూయార్క్(New York), పాలనా రాజధాని వాషింగ్టన్ (Washington)సహా పలు నగరాలు, పట్టణాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అధ్యక్షుడి నివాస భవనం శ్వేతసౌధం(White House) ఎదుటూ ఆందోళన కారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 250 ఏళ్ల కిందట 1775లో విప్లవ పోరాటం ప్రారంభమైన ఏప్రిల్ 19వ తేదీనే వారు ఈ ఆందోళనలు నిర్వహించడం గమనార్హం. అమెరికన్లపై సొంత ప్రభుత్వమే దాడులు చేస్తోందని, ఐక్యంగా నిలవాల్సిన అవసరముందని ఆందోళనకారులు వ్యాఖ్యానించారు. టెస్లా కార్ల దుకాణాల ఎదుటూ ఆందోళనలు నిర్వహించారు. మానవ హక్కులు రాజ్యాంగ ఉల్లంఘనలకు ట్రంప్ పాల్పడుతున్నారని ఆందోళనకారులు నిరసించారు.