మెలానియా ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సహాయకుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఆయన రాజకీయ ప్రచార ర్యాలీలలో కనిపించకపోవడంతో పలు అనుమాన్యాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్ ఆంథోనీ స్కారాముచి మెలానియా ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్కారాముచి మాట్లాడుతూ మెలానియా ఎన్నికల్లో భర్తకు కాకుండా కమలా హారిస్‌కు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో హారిస్ విజయం సాధించడానికి రహస్యంగా ఆమెకు సహకరిస్తున్నారని అన్నారు. మెలానియాకు ట్రంప్‌పై ఉన్న ద్వేషమే దీనికి కారణమని అన్నారు.






