జార్జియాలో డొనాల్డ్ ట్రంప్ బహిరంగ సభ
జార్జియాలో రెండు సెనేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. బైడెన్ విజయానికి జార్జియా, పెన్సిల్వేనియాలే కారణమయ్యాయని ఆరోపిస్తూ అక్కడి అధికారులను దేశ వ్యతిరేకులు అని ఆరోపించారు. జరిగిన అక్రమాలకు వారే బాధ్యులంటూ ఆగ్రహంతో విమర్శించారు. అధ్యక్ష ఎన్నికలతో పాటు ఇక్కడ సెనేట్ స్థానాలకు జరిగిన ఓటింగ్లో ఏ అభ్యర్థికీ అవసరమైన కనీస మెజార్టీ రాలేదు. దాంతో జనవరి 5న రన్ ఆఫ్ ఎలక్షన్స్ పేరుతో మళ్లీ ఎన్నికలు జరపనున్నారు. ఇందులో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల తరపున ట్రంప్ అక్కడికి వెళ్లి ప్రచారం చేయనున్నారు.






