అలబామా వర్సిటీలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య చర్చ
అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య జరిగే చర్చలో భారత సంతతి వ్యక్తులు నిక్కీ హెలీ, వివేక్ రామస్వామి కూడా పాల్గొంటున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున నామినేషన్‌ను ఆశిస్తున్న నలుగురిలో మిగతా ఇద్దరు ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రాన్ డిశాంటిస్, న్యూజెర్సీలో మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ. రిపబ్లికన్ ఓటర్ల మద్దతు పొందడానికి ఈ నలుగురు తమ మత విధానాలను చర్చలో వివరిస్తారు. ప్రస్తుతం 60 శాతం రిపబ్లికన్ ఓటర్ల మద్దతుతో డొనాల్డ్ ట్రంప్ అగ్రగామిగా నిలుస్తున్నారు. అధ్యక్షుడిగా పార్టీ నామినేషన్ తనకే లభిస్తుందంటూ అధ్యక్షుడిగా పార్టీ నామినేషన్ తనకే లభిస్తుందంటూ ఆయన మెదటి నుంచీ అభ్యర్థుల చర్చల్లో పాల్గొనడం లేదు. ప్రస్తుతం పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో హెలీ, డి శాంటిస్లు ట్రంప్‌నకు గట్టి పోటీ ఇస్తున్నారు.






