విదేశీ గడ్డపై అమెరికా చట్టాల అమలు ఎలా?
భారతీయ వ్యాపారవేత్త గౌతం అదానీపై దాఖలైన లంచం కేసులో అమెరికా విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటిదాకా స్థానికంగా చట్టాలను అమలు చేసిన ఆ దేశం, విదేశాల్లో తన చట్టాలను ఎలా అమలు చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. మా స్థానిక చట్టాలు అమెరికాలో ఎప్పటిలాగే అమలవుతాయి. వాటిని అమెరికా ఆవల ఎలా అమలు చేయాలన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమైంది అని ప్రముఖ అటారీ రవి బాత్రా పేర్కొన్నారు. 26.5 కోట్ల డాలర్ల లంచం కేసులో గౌతం అదానీతోపాటు సాగర్ అదానీ, మరో ఆరుగురిని నిందితులుగా అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై బాత్రా స్పందించారు.






