బైడెన్ కు 41 శాతం.. కమలా హారిస్ కు 37 శాతం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెద్దగా ప్రజల నుంచి మద్దతు లేదు. ఎందకంటే తాజాగా అసోసియేటెడ్ ప్రెస్ ఎన్వోఆర్సీ సెంటర్ నిర్వహించిన పోల్‌లో ఆయనకు మొత్తంగా 41 శాతం మద్దతే లభించింది. అందులోనూ ఆర్థిక వ్యవస్థను బైడెన్ చక్కదిద్దిన తీరును కేవలం 34 శాతం మందే మెచ్చుకున్నారు. డెమోక్రాట్లలో 72 శాతం మంది బైడెన్ పనితీరును సమర్థించారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఆయన పనితీరును 60 శాతం మంది డెమోక్రాట్లు మెచ్చుకున్నారు. మే నుంచి ఇందులో పెద్దగా మార్పు లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయబోతున్న బైడెన్‌కు ఇది ఇబ్బందికరమే. రిపబ్లికన్లలో అయితే ప్రతి 10 మందిలో ఒకరే బైడెన్ విధానాలకు మద్దతు పలికారు. ప్రస్తుతం 80 ఏళ్ల బైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడు. దీంతో కొంత మంది ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పట్ల సానుకూలతో ఉన్నారు. 37 శాతం మంది అమెరికు మద్దతుగా నిలిచారు. 50 శాతం మంది వ్యతిరేకించారు. 12 శాతం ఎటూ చెప్పలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఫర్వాలేదని జనం అంటున్నా వారి మనసులో వ్యతిరేక భావనలే ఉన్నాయి.






