అమెరికాలో ముందస్తు ఓటింగ్… 2.1 కోట్ల మంది
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ముందస్తు ఎన్నికల్లో దాదాపు 2.1 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నట్లుగా తెలిసింది. అమెరికా అధ్యక్ష పీఠం కోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 5న దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ముందస్తు పోలింగ్ సౌకర్యాన్ని 78 లక్షల మంది వినియోగించుకోగా, మెయిల్ బ్యాలెట్ ద్వారా మరో 1.33 కోట్ల మంది ఓటేసినట్లు తెలిసింది. భారత సంతతి అమెరికన్లు కూడా పెద్ద సంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు తెలిసింది.






