Elon Musk : ఎలాన్ మస్‌కు షాక్… ఫెడరల్ ఉద్యోగులు మూకుమ్ముడిగా

ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వాములం కాలేమంటూ ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని డోజ్ (Doze)లో పని చేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మూకుమ్ముడిగా రాజీనామా చేశారు. కీలకమైన సివిల్ సర్వీస్ ఉద్యోగుల తొలగింపునకు తమ సాంకేతిక నైపుణ్యాలను వినియోగించలేమని స్పష్టం చేశారు. మూకుమ్మడిగా ఇంజినీర్లు(Engineers), డేటా సైంటిస్టులు(data scientists) , ప్రొడక్ట్ మేనేజర్లు ఇలా రాజీనామా చేయడం మస్క్‌తో పాటు అధ్యక్షుడు ట్రంప్ (Trump)నకు షాకేనని భావిస్తున్నారు. మేం అమెరికన్ ప్రజలకు సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేశాం. అధ్యక్ష పాలనా వ్యవస్థలో రాజ్యాంగ విలువలను నిలబెడతామని ప్రమాణం చేశాం అని సంయుక్త రాజీనామా లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఫెడరల్ ప్రభుత్వ సైజును తగ్గించేందుకు మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజ్‌లో రాజకీయ ఉద్దేశాలున్నవారే అధికంగా ఉన్నారని, లక్ష్య సాధనలో వారికి నైపుణ్యంగానీ, అనుభవంగానీ లేవని ఆరోపించారు.