ట్రంప్ ని తప్పు పట్టిన 1,000 మంది మాజీ న్యాయమూర్తులు మరియు న్యాయ నిపుణులు
2016 అధ్యక్ష ఎన్నికల్లో అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన స్థానాలలో 2020 అధ్యక్ష ఎన్నికల్లో అద్ధ్యక్షులు ట్రంప్ పై మిస్టర్ బిడెన్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అద్ధ్యక్షులు ట్రంప్ మిస్టర్ బిడెన్ గెలుపు ను అంగీకరించడానికి నిరాకరిస్తు మిచిగాన్, అరిజోన, పెన్సిల్వేనియా మరియు వివిధ న్యాయస్థానాలలో మిస్టర్ బిడెన్ గెలుపును సవాలు చేస్తూ దావా వేయడంతో, రిటైర్డ్ ఫెడరల్ మరియు స్టేట్ జడ్జిలు, స్టేట్ అటార్నీ జనరల్ మరియు లా ప్రొఫెసర్లతో సహా 1,000 మంది న్యాయవాదుల బృందం 2020 ఎన్నికల ఓట్ల నమోదు మరియు లెక్కింపు లో విస్తృతంగా మోసం జరిగినట్లుగా వివిధ న్యాయస్థానాలలో మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వేసిన దావాలు మరియు మిస్టర్ ట్రంప్ వాదనలు నిరాధారమైనవి అని విమర్శించారు.
ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి ఎన్నికలు చట్టబద్ధంగా జరిగేలా చూసే హక్కు ఉంది. కాని కోర్టు సవాళ్లు ఏదైనా ఉంటే అది వాస్తవాల ఆధారంగా, సాక్ష్యాల ఆధారంగా ఉండాలి అని తెలియజేస్తు, అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విస్తృతంగా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ మోసం జరిగింది అని పేర్కొన్న దైహిక మోసంపై తప్పుడు వాదనలు చేయడాన్ని ఆపమని ప్రభుత్వ అధికారులను కోరుతూ రిటైర్డ్ ఫెడరల్ మరియు స్టేట్ జడ్జిలు, స్టేట్ అటార్నీ జనరల్ మరియు లా ప్రొఫెసర్లతో సహా 1,000 మంది న్యాయవాదుల బృందం సంతకం చేసిన పత్రాన్ని అమెరికన్ బార్ అసోసియేషన్ విడుదల చేసింది.






