డీజీపీ, అమెరికన్ కాన్సులేట్ ఇన్వెస్టిగేషన్ విభాగం అధిపతి భేటీ
అమెరికన్ కాన్సులేట్ ఓవర్సీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అధిపతి ఎరిన్ ఫిషెర్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో అంజనీకుమార్‌తో ఎరిన్ పలు అంశాలపై చర్చించారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్(టోఫెల్), గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్( జీఆర్ఈ)లలో భారీగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది. ఇప్పటికే దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీస్ శాఖపై రూపొందించిన కాఫీ టేబుల్‌బుక్‌ను ఎరిన్ ఫిషెర్కు డీజీపీ అందజేశారు.













