నిరుద్యోగులకు గుడ్ న్యూస్…త్వరలో 3,035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 734 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.