తెలంగాణ భవన్ లో సంబురాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో తెలంగాణ భవన్లో సందడి వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మధుసూదనాచారి తదితరులు పాల్గొని గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయాల పరంపర కొనసాగుతోందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శాసనమండలిలో ఇతర పార్టీలకు అవకాశం లేదని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టమెచ్చినట్లు కామెంట్లు పెట్టే వారికి టీఆర్ఎస్ విజయం చెంప పెట్టు అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.













