ఆంధ్రకు ఆయనే కావాలి!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు అభిమానులు లక్షలాదిగా చేరుకున్నారు. అయితే ఈ అభిమానం తెలంగాణ వరకు పరిమితం కాలేదు. నవ్యాంధ్ర నుంచి కూడా టీఆర్ఎస్ సభకు అభిమానులు తరలివచ్చారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన జనం సభాప్రాంగణానికి హాజరయ్యారు. రావాలి, కావాలి.. ఆంధ్రకు కేసీఆర్ పాలన అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ అనే అభిమాని మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని, ఆయన ఏపీకి కూడా కావాలని అభిలషించారు. ప్రగతి నివేదన సభ కోసమే విజయవాడ నుంచి వచ్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే, ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మొదట్లో కేసీఆర్ పాలనను వ్యతిరేకించామని, ఆయన నాలుగేళ్ల పాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయన పాలన కావాలనిపిస్తోందని అన్నారు.













