Barack Obama: ఏలియన్స్ ఉన్నది నిజమే.. ఒబామా షాకింగ్ కామెంట్స్!
గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారా? విశ్వంలో మనకంటే తెలివైన జీవులు మరెక్కడైనా నివసిస్తున్నాయా? ఈ ప్రశ్నలు దశాబ్దాలుగా మానవాళిని వేధిస్తూనే ఉన్నాయి. గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (UFOs), ఏలియన్ల ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా అనేక కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, అగ్రరాజ్యం అమెరికాకు వీటితో ఏదో విడదీయలేని సంబంధం ఉందన్నది చాలా మంది నమ్మకం. ముఖ్యంగా అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న అత్యంత రహస్య సైనిక స్థావరం ‘ఏరియా 51’ (Area 51) గురించి ఎన్నో కథలు (Conspiracy Theories) వినిపిస్తుంటాయి. ఈ అంశాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న ఒబామా (Barack Obama).. విశ్వంలో మన సౌర కుటుంబం వెలుపల మరేదైనా గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. గ్రహాంతరవాసుల ఉనికిపై తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సందేహం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో ఏలియన్లకు సంబంధించి సామాన్యుల్లో ఉన్న కొన్ని అపోహలను ఆయన కొట్టిపారేశారు. ముఖ్యంగా ‘ఏరియా 51’లో అమెరికా ప్రభుత్వం గ్రహాంతరవాసులను బందీలుగా ఉంచిందనే ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ఆయన (Barack Obama) స్పష్టం చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఇటువంటి విషయాలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు తన దృష్టికి రాలేదని ఆయన వివరించారు.
దశాబ్దాల క్రితం అమెరికా ఎయిర్ ఫోర్స్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్లలో మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాలపై అంతుచిక్కని వస్తువులు లేదా జీవుల కదలికలు కనిపించాయన్న నివేదికలపై కూడా ఒబామా (Barack Obama) స్పందించారు. ఇటువంటి రహస్య రికార్డులు ప్రభుత్వం వద్ద ఉండవచ్చని చాలా మంది అనుకుంటుంటారు, కానీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సమాచారం ఏదీ తన వద్దకు రాలేదని ఆయన (Barack Obama) తేల్చి చెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇంతకీ ఈ ఏరియా 51 ఏమిటి? దీనిపై ఎందుకంత చర్చ? అనే విషయానికి వస్తే.. అమెరికాలోని నెవాడాలో సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం ఒక అత్యంత రహస్య సైనిక స్థావరం. 1955లో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో అమెరికా తన అత్యాధునిక ఆయుధాలను, నిఘా విమానాలను (ఉదాహరణకు లాక్హీడ్ మార్టిన్ యూ-2) పరీక్షిస్తుంటుంది. ఒకప్పుడు ఇక్కడి ఉపగ్రహ చిత్రాల తీతపై కూడా కఠినమైన నిషేధం ఉండేది. ఇక్కడ జరిగే రహస్య ప్రయోగాల వల్లే.. అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే వింత కాంతులు లేదా ఎగిరే వస్తువులను చూసి జనం అవి ఏలియన్లకు సంబంధించినవని భ్రమపడుతుంటారని విశ్లేషకులు చెబుతుంటారు. ఒబామా (Barack Obama) వ్యాఖ్యలతో ఏరియా 51పై ఉన్న కుట్ర సిద్ధాంతాలకు కొంత మేర బ్రేక్ పడినట్లయింది, కానీ గ్రహాంతరవాసుల ఉనికిపై మాత్రం చర్చ కొనసాగుతూనే ఉంది.













