ఈ సారి కూడా వేడుకలకు దూరం… హరీశ్రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‍రావు పుట్టిన రోజు (జూన్ 3వ తేది). ఆయన 49వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు. మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అభిమానానికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. కరోనా, లాక్‍డౌన్ కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరండా ఉండాలని నిర్ణయించుకున్నాను.