టీఆర్ఎస్ ఎంపీ సంతోశ్ కు కరోనా

హైదరాబాద్: టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా లక్షణాలేవీ కనిపించడం లేదన్నారు. ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా తీవ్రత బాగా ఉందని ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని సంతోశ్ విజ్ఞప్తి చేశారు.