హూజుర్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
నల్లగొండ జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. హుజుర్నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి హుజుర్నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజుర్‌నగర్‌కు ఉప ఎన్నిక జరగనుంది.













