సాగర్ లో బిజెపి ప్రత్యర్ధి తెరాస, కాంగ్రెస్ కాదా…?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ప్రధానంగా నాయకత్వ లోపం అనేది తెలంగాణలో ఎక్కువగా కనబడుతుంది. అయితే ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ఏంటనే దానిపై ఆ పార్టీ నేతలు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కంటే కూడా జానారెడ్డి ఓడిపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అభ్యర్థికి బలం ఎక్కువగా ఉన్నది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు విజయం పై చాలా ఆశలు పెట్టుకున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా అధికార పార్టీకి జానారెడ్డిని ఎదుర్కోవడం కష్టమే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు క్షేత్రస్థాయిలో ఇక్కడ బలం ఉన్న సంగతి తెలిసిందే. నాయకత్వ లోపం ఉన్నా సరే జానారెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ప్రజలలో ఎక్కువగా ఉంది. అందుకే జానారెడ్డి విషయంలో భారతీయ జనతాపార్టీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల కంటే కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఎంత ఉంది అనే విషయం పక్కన పెడితే ఇక్కడ జానారెడ్డి విజయాన్ని గనుక అడ్డుకోగలిగితే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీపై దాదాపుగా విజయం సాధించినట్టే అవుతుంది. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్పుకునే అవకాశం కూడా భారతీయ జనతా పార్టీకి దొరుకుతుంది అని చెప్పాలి ఆర్థికంగా కూడా జానారెడ్డి చాలా బలమైన నేత. అందుకే ఆయన విషయంలో టీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని విధాలుగా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన దాదాపు మంచి అభివృద్ధి చేసారు. మంత్రిగా ఉన్న ఈ సమయంలో ఆయన చేసిన అభివృద్ధి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా సరే ప్రజల్లోనే ఆయన ఎక్కువగా ఉంటున్నారు. హైదరాబాదులో కంటే నియోజకవర్గంలోని ఎక్కువగా తిరగడంతో నాగార్జునసాగర్ లో జానారెడ్డి అడ్డుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు కెసిఆర్ ఇమేజ్ తో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని కానీ ఇప్పుడు నాగార్జునసాగర్ లో అలాంటి పరిస్థితి కనబడటం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీజేపీ మీద కూడా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.













