నాసాకు టీఎమ్మార్ విద్యార్థులు
అంతర్జాతీయ గుర్తింపు పొందిన అమెరికాలోని నాసా అంతరిక్ష ప్రయోగ కేంద్రం సందర్శనకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ (టీఎమ్మార్) స్కూళ్లు చెందిన ఆరుగురు విద్యార్థుల బృందం నేడు వెళ్లనున్నది. ఈ నెల 23 నుంచి 27 వరకు నాసాలో జరుగనున్న యాన్యువల్ ఇంటర్నేషనల్ స్పేస్ డెవెలప్మెంట్ కాన్ఫెరెన్స్ (ఐఎస్డీసీ) 2018లో ఈ బృందం పాల్గొననున్నది. టెమ్రీస్ ప్యూజన్ ఎల్-5 ప్రాజెక్ట్ నివేదికను విద్యార్థులు ఈ సదస్సులో సమర్పించనున్నారు. నేడు రాత్రి వీరు అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నాసా అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. నాసా నుంచి ఆహ్వానం పొందిన విద్యార్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
విద్యార్థుల బృందాన్ని అభినందించిన క్యాథరిన్ హడ్డా :
నాసాకు ఎంపికైన విద్యార్థులు సయ్యద్ ఇబ్రాహీం అలీ, మహవీన్ మహ్మదీ, సఫా మాహిన్, ఫిరోజ్ హుస్సేన్, ముస్కాన్ తబస్సుమ్, ఫిరోజ్ అహ్మద్, నాసా వెళ్లే బృందంలో ఉన్నారు. యూఎస్ కౌన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా విద్యార్థులను అభినందించారు.













