తెలుగు రాష్ట్రాల్లో ఏవై 12 కలకలం

తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలను ఇప్పుడు ఏవై 12 రకం కరోనా వేరియంట్ ఆందోళనకు గురిచేస్తోంది. ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ గత నెల 30న ఉత్తరాఖండ్‍లో వెలుగు చూడగా, వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు పాకింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 178 కేసులు నమోదు కాగా తెలంగాణలో 15, ఆంధప్రదేశ్‍లో 18 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని వికారాబాద్‍లో 9, వరంగల్‍లో నాలుగు, హైదరాబాద్‍లో 2 కేసులు వెలుగు చూశారు. కేసుల విషయంలో ఉత్తరాఖండ్‍తో కలిపి ఆంధప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.
డెల్టాప్లస్ వేరియంట్‍కు సంబంధించి తమ వద్ద ఉన్న నమూనాలను మళ్లీ పరీక్షించిన సీసీఎంబీ, వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్నట్టు గుర్తించింది. ఉపిరితిత్తుల కణాల్లో అది బలంగా అతుకుపోతోందని, మోనోక్లోనల్ యాంటీబాడీ స్పందనను అది తగ్గిస్తోందని గుర్తించారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణ కార్యకలాపాలు మళ్లీ పెరుగుతుండడంతో వ్యాధి సంక్రమణ అవకాశాలు మళ్లీ పెరగాయని నిపుణులు చెబుతున్నారు.