తెలంగాణలో కొత్తగా 5,559 కేసులు…

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,559 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,87,199కు చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 41 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,626కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 8,061 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4,13,225 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్ అయ్యారు. జీహెచ్‍ఎంసీ పరిధిలో 984, రంగారెడ్డి 457, మేడ్చల్ మల్కాజిగిరిలో 372, సిద్దిపేట 201, వరంగల్ అర్బన్‍లో 296, నల్లగొండలో 208,కరీంనగర్‍లో 201, ఖమ్మంలో 200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 71,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 84.12 శాతం ఉండగా 84.81 శాతానికి పెరిగింది. జాతీయ సగటు 81.9 శాతంగా నమోదైంది.