తెలంగాణలో కొత్తగా 2157 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 72,634 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. వైరస్ వల్ల 8 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,780కి చేరింది. కరోనా బారి నుంచి 821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,07,499కి చేరింది. ప్రస్తుతం 25,459 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 16,892 మంది హోం ఐసోలేషన్‍లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‍ఎంసీ పరిధిలో అత్యధికంగా 361, మేడ్చల్ జిల్లాలో 245, రంగారెడ్డిలో 204 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,12,53,374కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 23,12,340 మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇందులో 20,10,611 మంది తొలి డోసు వేయించుకున్నారు.