ఆరు స్థానాలు ఏకగ్రీవం… మరో ఆరింటిలో పోటీ
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రంగారెడ్డిలో 2 స్థానాలు, వరంగల్లో ఒక స్థానం, నిజామాబాద్లో ఒక స్థానం, మహబూబ్నగర్లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ 2 స్థానాలు, మెదక్, నల్గొండ జిల్లాలో ఒక్కో స్థానానికి డిసెంబర్ 19న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14న కౌంటింగ్ చేస్తారు. ఆదిలాబాద్ నుండి దండె విఠల్, నల్లగొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధు, మెదక్ నుంచి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, కరీంనగర్ నుంచి భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ బరిలో ఉన్నారు.













