ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబందించిన పది అంశాలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రధానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు. కొత్త జోనల్ వ్యవస్థ, రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలని, రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు వంటి అంశాలపై ప్రధానికి కేసీఆర్ వినతిపత్రం ఇచ్చారు. దాదాపు ఏడు నెలల తర్వాత ప్రధానితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వాస్తవానికి గతవారమే ప్రధానితో కేసీఆర్ సమావేశంకావాల్సి ఉంది. అయితే మోదీ విదేశీ పర్యటలో ఉండటంతో అపాయింట్మెంట్ ఖరారు కాలేదు.













